: సుబ్బరాజుకు బీపీ డౌన్! కొనసాగుతున్న సిట్ విచారణ!
డ్రగ్స్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న సినీ నటుడు సుబ్బరాజు ఒత్తిడికి గురికావడంతో ఆయన బీపీ డౌన్ అయినట్టు సమాచారం. వెంటనే, స్పందించిన అధికారులు టెన్షన్ పడొద్దని చెప్పినట్టు తెలుస్తోంది. అంతకుముందు, సుబ్బరాజు రక్త నమూనాలను ఉస్మానియా వైద్యులు సేకరించారు. టాలీవుడ్ ను షేక్ చేసే అనేక విషయాలు సుబ్బరాజు చెప్పినట్టు సమాచారం.
సుమారు 10 నుంచి 15 మంది నటీనటులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సుబ్బరాజు చెప్పినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ ను ఎక్కడ, ఏ విధంగా తీసుకుంటున్నారో చెప్పారని, ఈ విషయాలపై ఆధారాలు సేకరించే పనిలో సిట్ అధికారులు ఉన్నట్టు సమాచారం. కాగా, టాలీవుడ్ తో దశాబ్దాలుగా సంబంధమున్న సినీ కుటుంబానికి చెందిన ఇద్దరికి డ్రగ్స్ తో సంబంధమున్నట్టు సిట్ వర్గాల సమాచారం.