: సెంటిమెంట్ కోసం కాదు కంఫర్ట్ కోసమే బ్యాంకాక్ కు వెళుతుంటాను: పూరీ జగన్నాథ్
తాను బ్యాంకాక్ కు వెళ్లేది స్క్రిప్ట్ వర్క్ కోసమని, బీచ్ లో కూర్చుని రాసుకోవడం తనకు అలవాటని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘బీచ్ లో గొడుగులు అవీ వేసి ఉంటాయి. అక్కడ నాకు తెలిసిన ఓ ఫ్యామిలీ ఉంది. పదిహేనేళ్ల నుంచి నాకు వాళ్లు పరిచయం. వాళ్లు నాకు కాఫీ.. అవి ఇస్తుంటారు. ఏవైనా కావాలంటే తెచ్చిపెడుతుంటారు. అక్కడ కూర్చుని రాసుకుంటూ ఉంటాను. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్కడే కూర్చుని కదలకుండా రాస్తాను. మళ్లీ మర్నాడు ఉదయం అవే టైమింగ్స్ కు వచ్చి వర్క్ చేస్తుంటాను. వేరే వాళ్లు 6 నెలలు, ఒక సంవత్సరంలో రాసే స్క్రిప్ట్ ను నేను పదిహేను రోజుల్లో రాస్తాను, అంటే, నాకు ఎంత ఫోకస్ ఉండాలి. నేను సెంటిమెంట్ కోసం బ్యాంకాక్ వెళ్లను.. కంఫర్ట్ కోసం వెళతాను. నేను దేవుడ్నే మొక్కను, ఇంకా, సెంటిమెంట్లు ఏముంటాయి!’ అని పూరీ చెప్పుకొచ్చారు.