: ఓ మనిషి చచ్చిపోతే ఎలా ఏడుస్తారో.. మా ఇంట్లో వాళ్లు అలా ఏడ్చారు!: దర్శకుడు పూరీ ఆవేదన


డ్రగ్స్ వ్యవహారంలో రెండు రోజుల క్రితం సిట్ అధికారుల విచారణ ఎదుర్కొన్న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఈ ఆరోపణలు నాపై ఎందుకు పడ్డాయని అనిపించింది. ఇంట్లో అందరూ ఏడ్చారు. ఎలా ఏడ్చారంటే.. మనుషులు చచ్చిపోతే ఎలా ఉంటుందో అలా ఏడ్చారు. పరువుపోయిందన్నట్టుగా ఏడ్చారు.

మామూలుగా నాకు చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్. నేను పార్టీ చేసుకున్నా కూడా.. నేను వర్క్ చేస్తున్న టీమ్ తోనే చేసుకుంటా. వేరే బ్యాచ్ లతో కలవడమనేది అసలు ఉండదు.... నేను షూటింగ్ చేస్తున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. నేను చాలా బాధపడ్డాను. నేను డ్రగ్స్ సరఫరా చేస్తున్నానని వార్తలు రావడంతో నా భార్య ఫోన్ చేసింది. అలాగే, నేనేదో ప్రాస్టిట్యూట్ కంపెనీని ఢిల్లీలో నడుపుతున్నానని, బేగం అనే ఒక ఆవిడ ఉందని, బ్యాంకాక్ లో ప్రాస్టిట్యూట్ కంపెనీలో ఏదో జరిగిందని.. నా పాస్ పోర్టు సీజ్ చేశారంటూ..ఇలా రకరకాల స్టోరీలు నాపై వన్ డేలో హండ్రెడ్ పుట్టించారు’ అని పూరీ అన్నారు.

  • Loading...

More Telugu News