: సినీ పరిశ్రమను ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం: నారా లోకేశ్
సినీ పరిశ్రమను ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఆర్డీఏ పరిధిలో 20 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ గురించి ప్రస్తావిస్తూ.. జగన్ కంటున్న కలలు ఎప్పటికీ నెరవేరవని, ఆయన కోరిక ఎప్పటికీ తీరదని అన్నారు. తప్పు చేస్తే తనతో సహా ఎవరైనా తప్పించుకోలేరని, దొంగలు ఎప్పటికైనా జైలుకే వెళ్తారని అన్నారు. కాగా, శ్రీసిటీ సెజ్ లో తయారైన సెల్ కాన్ స్మార్ట్ ఫోన్ ను లోకేశ్ ఆవిష్కరించారు. ప్రధాని మోదీది మేడిన్ ఇండియా అయితే, సీఎం చంద్రబాబుది మేడిన్ ఆంధ్రా నినాదమని అన్నారు.