: మహేశ్ బాబు కూతురు సితార పుట్టిన రోజు సందడి!
ప్రముఖ అగ్రహీరో మహేశ్ బాబు-నమ్రతా శిరోద్కర్ ల చిన్నారి సితార తన 5వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సితార తల్లి నమ్రతాశిరోద్కర్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. బర్త్ డే పార్టీ సందర్భంగా డెకరేట్ చేసిన గదిలో సితారతో మహేశ్-నమ్రత, సోదరుడు గౌతమ్ తో ఉన్న సితార కేక్ కోసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తీసిన ఓ ఫొటోను, కేక్ కోస్తుండగా తీసిన మరో ఫొటోను పోస్ట్ చేశారు. అంతేకాకుండా, బర్త్ డే డెకరేషన్ తో ఉన్న గది ముందు, ‘సితార టర్న్స్ 5’ అని రాసి ఉన్న కార్డుబోర్డు ముందు నిలబడ్డ సితార ఫొటోకు పోజు ఇస్తుండగా తీసిన ఓ ఫొటో కూడా ఈ పోస్ట్ లో ఉంది.