: మరోసారి పాకిస్థాన్‌కు భారీ షాక్ ఇచ్చిన అమెరికా
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్‌కు అమెరికా నుంచి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా అమెరికా మిలిటరీ సంస్థ పెంటగాన్ ఓ ప్రకటన చేస్తూ... ఇక పాక్‌కు మిలిటరీ రియంబర్స్‌మెంట్ కింద గత సంవత్సరానికి ఎటువంటి చెల్లింపులు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అమెరికా రక్షణశాఖ కార్యదర్శి జిమ్ మాట్టిస్ ఈ విషయంపై మాట్లాడుతూ... ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో పాకిస్థాన్ విఫలమైందని తేల్చి చెప్పారు. ఆ దేశంలో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్‌వర్క్‌ను పాక్ ఏ మాత్రం కట్టడి చేయలేకపోయిందని అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవట్లేదని పాక్‌కు సెక్రటరీగా వ్యవహరిస్తున్న తమ దేశ ప్రతినిధి జిమ్ మాట్టిస్ ధ్రువీకరించారని ఆయన స్పష్టం చేశారు.