: హైదరాబాద్ శివారులో 150 కిలోల గంజాయి స్వాధీనం
హైదరాబాద్ శివారులో ఇద్దరు వ్యక్తులు తరలిస్తున్న 150 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డులో ఈ రోజు సాయంత్రం విస్తృతంగా సోదాలు జరిపామని పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే భారీగా గంజాయి పట్టుబడిందని చెప్పారు. మరోవైపు ఈ రోజు ఉదయం కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏలూరు నుంచి ఢిల్లీకి వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో 45 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అనంతరం నిందితులను రైల్వే కోర్టులో హాజరుపరిచారు.