: 24వ తేదీ నుంచి టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ఇంటర్వ్యూలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని, ఇంటర్వ్యూలు నిలిపివేయాలంటూ హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం ఇటీవల దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీ నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటన చేసింది.