: సినీ నటుడు నవదీప్ కు చెందిన పబ్ లో డ్రగ్స్ అమ్మకాలు.. సిట్ గుర్తింపు
డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సినీ నటుడు నవదీప్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ లోని 16 బార్లలో డ్రగ్స్ అమ్ముతున్నట్టు గుర్తించిన అధికారులు, పలు పబ్ లలో ఈ విక్రయాలు జరుపుతున్నట్టు తేల్చారు. అంతేకాకుండా, నవదీప్ కు చెందిన బీపీఎం పబ్ సహా క్లౌడ్ నైన్, వాటర్స్ పబ్, టెన్ డౌనింగ్ స్ట్రీట్, లిక్విడ్స్, డూప్లిన్ పబ్స్ లోనూ డ్రగ్స్ అమ్మకాలు జరిగినట్టు సిట్ గుర్తించింది. కాగా, డ్రగ్స్ వ్యవహారంలో నటుడు నవదీప్ ఈ నెల 24న సిట్ అధికారుల విచారణ ఎదుర్కోనున్నాడు. ఈ తరుణంలో ఈ విషయం బయటపడటం గమనార్హం.