: సందడిగా గడిపిన ‘బాహుబలి’ ప్రభాస్, ‘జోగేంద్ర’ రానాను చూడండి!
బాహుబలి సినిమాలో అదరగొట్టిన ప్రభాస్, రానాలు తాజాగా ఒక్కచోట చేరి సందడిగా గడిపారు. ఈ సందర్భంగా రానా తన స్మార్ట్ ఫోన్‌తో ప్రభాస్ ఫొటోలు తీశాడు. ప్రస్తుతం రానా చేతిలో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ఉంది. అలాగే ఆయన జెమిని టీవీలో ప్రసారమవుతున్న ‘నెంబర్ 1 యారీ విత్ రానా’ ప్రోగ్రాంలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ రోజు ప్రభాస్ ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా షూటింగ్ విశేషాలను తెలుసుకున్నాడు. ప్రభాస్ ఆ సెట్లో ఉండగా తాను తీసిన పలు ఫొటోలను రానా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ పోస్టర్ పక్కన నిల్చున్న ప్రభాస్ ఫొటోను రానా తీశాడు. తాను బాహుబలి ప్రభాస్ తో ఉన్న జోగేంద్ర ఫొటోను తీశానని రానా పేర్కొన్నాడు.