: మంత్రి లోకేశ్ ఛాంబర్ వద్ద మహిళ హంగామా!
అమరావతిలో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఛాంబర్ వద్ద ఓ మహిళ నానా హంగామా చేసింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆ ఛాంబర్ వద్దకు వచ్చిన ఆ మహిళను సెక్యూరిటీ అడ్డుకున్నారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ వారిపై సదరు మహిళ కేకలు వేస్తూ ఆగ్రహంతో ఊగిపోయింది. ఎట్టకేలకు, సెక్యూరిటీ సిబ్బంది ఆమెను బయటకు తీసుకువెళ్లారు. అనంతరం, సదరు మహిళ మీడియాతో మాట్లాడుతూ, తన పిల్లలు చర్మ వ్యాధులతో బాధపడుతున్నారని, తమ సమస్యలు లోకేశ్ కు చెప్పుకుందామని వస్తే, సెక్యూరిటీ అడ్డుకున్నారని చెప్పింది. తన పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆ మహిళ మీడియాకు చెప్పడం గమనార్హం. సదరు మహిళ పేరు, స్వస్థలం, ఆమె కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.