: 27న ముమైత్ ఖాన్ ను విచారిస్తాం: అకున్ సబర్వాల్
డ్రగ్స్ వ్యవహారంలో ఐటెమ్ సాంగ్స్ స్పెషలిస్టు ముమైత్ ఖాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సిట్ అధికారుల విచారణకు ఆమె హాజరయ్యే విషయమై ఇంతవరకూ ఎటువంటి స్పష్టత లేదు. అయితే, ఈ విషయమై ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ, విచారణకు హాజరవుతానని ముమైత్ ఖాన్ తమకు సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. 27వ తేదీన ఆమెను విచారించనున్నట్లు చెప్పారు. కాగా, రేపు ఆబ్కారీ భవన్ లో పబ్ లు, బార్ల యజమానులతో సిట్ అధికారులు సమావేశం కానున్నారని అకున్ సబర్వాల్ చెప్పారు. ఇదిలా ఉండగా, ‘బిగ్ బాస్’ షో లో పాల్గొంటున్న ముమైత్ ఖాన్ కు ఎక్సైజ్ అధికారులు ఫ్యాక్స్ ద్వారా నోటీసులు అందించారు. నోటీసు అందుకున్నట్లు ఆమె నుంచి ఎకనాలెడ్జ్ మెంట్ వచ్చినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.