: ఇప్పుడు ఉప ఎన్నిక కోసం మరెన్ని హామీలు గుప్పిస్తారో!: బొత్స ఎద్దేవా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధించడం కోసం ఎనిమిది మంది టీడీపీ మంత్రుల ముఠా రంగంలోకి దిగిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు మరోసారి నంద్యాలకు వస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని విమర్శించారు. ఇప్పుడు నంద్యాలలో జరగనున్న ఉప ఎన్నిక కోసం మళ్లీ ఎన్ని హామీలు గుప్పిస్తారో అంటూ చురకలంటిచారు. ఇన్ని రోజులూ లేనిది ఓట్ల కోసం ఇప్పుడు రోడ్ల విస్తరణ పనులు చేపట్టారని ఆయన విమర్శించారు.