: సుష్మా స్వరాజ్ అబద్ధం చెబుతోంది.. వాళ్లకంత సీన్ లేదు!: చైనా మీడియా
ఒకవేళ యుద్ధం వరకు వస్తే భారతదేశానికి ప్రపంచంలో అన్ని దేశాల మద్దతు ఉందంటూ గురువారం పార్లమెంట్‌లో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చెప్పిన మాటలన్నీ అబద్ధమంటూ చైనా మీడియా వ్యాఖ్యానించింది. ఆ దేశ గ్లోబల్ టైమ్స్ పత్రికలోని ఎడిటోరియల్ అంశాల్లో `భారతదేశానికి ఏ దేశం మద్దతివ్వడం లేదు. వారి విదేశాంగ మంత్రి చెప్పేవన్నీ అబద్ధాలే` అంటూ ప్రచురించింది. అలా అనడానికి గల కారణాలను కూడా వ్యాసంలో వివరించింది.
`చైనా భూభాగాన్ని ఆక్రమించింది వాళ్లు. అలాంటి వాళ్లకు ప్రపంచ దేశాల మద్దతు ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే ఒకవేళ యుద్ధం వరకు వస్తే భారత్ ఓటమి ఖాయం. ఎందుకంటే వాళ్ల ఆర్మీ కంటే చైనా మిలటరీ చాలా పటిష్టమైనది` అని సంపాదకీయంలో పేర్కొంది. అలాగే రెండు దేశాల సైన్యాలను వెనక్కి పిలిచే విషయం గురించి ప్రస్తావిస్తూ - `అలా జరిగే ప్రసక్తే లేదు. సైన్యాన్ని వెనక్కి పిలవాల్సింది భారత్ మాత్రమే. అంగుళం భూమి కూడా కోల్పోవడానికి చైనా సిద్ధంగా లేదు. ఆ విషయంలో యుద్ధానికైనా సిద్ధమే!` అని రాసింది.