: 17 ఏళ్ల‌లో వేగం పుంజుకున్న‌ ఉత్తర కొరియా ఆర్థిక వ్య‌వ‌స్థ!


ఆయుధ ప‌రీక్ష‌ల కోసం అతిగా ఖ‌ర్చుపెడుతోంద‌న్నది ఉత్తర కొరియాపై ప్ర‌పంచ దేశాల అభిప్రాయం. వారి అభిప్రాయం ఎలా ఉన్నా ఉత్తర కొరియా ఆర్థిక వ్య‌వ‌స్థ మాత్రం గ‌డ‌చిన 17 ఏళ్ల‌లో భారీ అభివృద్ధి సాధించింద‌ని ఆ దేశ కేంద్ర బ్యాంకు తెలిపింది. గ‌తేడాదితో పోల్చిన‌పుడు ఈ ఏడాది స్థూల దేశీయోత్ప‌త్తిలో 3.9 శాతం పెరుగుద‌ల సాధించిన‌ట్లు బ్యాంకు ఆఫ్ కొరియా ప్ర‌క‌టించింది. ఎగుమ‌తులు పెర‌గ‌డం, మైనింగ్‌తో పాటు ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లో ఉత్ప‌త్తి పెర‌గ‌డం వ‌ల్ల ఈ అభివృద్ధి సాధ్య‌మైంద‌ని వివ‌రించింది. దేశ ఆర్థికాభివృద్ధిలో 12.6 శాతం భాగ‌స్వామ్యం గ‌ల మైనింగ్ రంగ ఉత్ప‌త్తి ఈ ఏడాది 8.4 శాతం వ‌ర‌కు పెరిగింది. అలాగే భారీ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌ల ఎగుమ‌తులు కూడా విప‌రీతంగా పెర‌గ‌డంతో ఆర్థిక వ్య‌వ‌స్థ ముందుకు సాగే అవ‌కాశం ఏర్ప‌డిన‌ట్లు బ్యాంక్ ఆఫ్ కొరియా వెల్ల‌డించింది.

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో ఉత్తర కొరియా నుంచి చైనా త‌మ బొగ్గు దిగుమ‌తుల‌ను నిలిపివేసినా, ఇనుము, ఉక్కు ఖ‌నిజాల దిగుమ‌తుల‌ను కొన‌సాగిస్తూనే ఉంది. అలాగే చైనా నుంచి దిగుమ‌తి చేసుకున్న వ‌స్తువుల‌న్నింటికీ ఉత్తర కొరియాలో మంచి డిమాండ్ ఉండ‌టంతో వారి వ్యాపారాలు కూడా ఊపందుకున్నాయి. దీంతో ఉత్తర కొరియా ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు మ‌రింత లాభం చేకూరింది.

  • Loading...

More Telugu News