: ఆస్ట్రేలియాలో మన జెండా ఎగురవేయనున్న తొలి భారతీయ నటి!


ఈ ఏడాది ఆగస్టు 10 నుంచి ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం) వేడుకలు ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ బచ్చన్ ప్రత్యేక అతిథిగా హాజరుకానుంది. ఈ సందర్భంగా ఆగస్టు 12న మెల్ బోర్న్ లోని ప్రముఖ ఫెడరేషన్ స్వ్కేర్ బిల్డింగ్ వద్ద జాతీయ జెండాను ఐష్ ఎగురవేయనుంది. మెల్ బోర్న్ లో మన జాతీయ జెండాను ఎగుర వేయనున్న తొలి భారతీయ నటి ఐశ్వర్యా రాయ్ కావడం విశేషం. ఈ సందర్భంగా మెల్ బోర్న్ ఫెస్టివల్ డైరెక్టర్ మిటు భౌమిక్ మీడియాతో మాట్లాడుతూ, ఐశ్వర్య ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం తమకు గర్వ కారణంగా ఉందని అన్నారు. కాగా, ఐఎఫ్ఎఫ్ఎం వేడుకలు 12 రోజుల పాటు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News