: పార్టీ బహిష్కరణకు గురైన గుజరాత్ నేత కాంగ్రెస్ కు గుడ్ బై!
కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్న బహిష్కరణకు గురైన గుజరాత్ సీనియర్ నేత, మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘెలా ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, పలువురు నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యసభ ఎన్నికల అనంతరం, కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని, ఆ పార్టీకి తానేమి బానిసను కాదని చెప్పారు. తన పుట్టినరోజు వేడుకల్లో తాను ఏదో చెబుతానని ఊహించిన కాంగ్రెస్ పార్టీ, తనను ముందుగానే పార్టీ నుంచి తొలగించిందని అన్నారు. కాంగ్రెస్ సభ్యత్వానికి, ఇతర అన్ని హోదాల నుంచి తప్పుకుంటున్నానని, రాజ్యసభ ఎన్నికలు పూర్తయిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు.