: మంత్రి పేరుతో సోషల్‌మీడియాలో నకిలీ అకౌంట్.... వ్యక్తి అరెస్ట్
మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి గిరీశ్ బాపత్ పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ సృష్టించిన వ్యక్తిని పూణే పోలీసులు అరెస్టు చేశారు. పూణేకు చెందిన 30 ఏళ్ల రుతురాజ్ నలవాడే, మంత్రి ఫొటో ఉపయోగించి సోషల్ మీడియాలో ఒక అకౌంట్ క్రియేట్ చేశాడు. ఆ అకౌంట్ ద్వారా అసభ్య పదజాలం ఉపయోగిస్తూ పోస్టులు చేస్తుండటంతో మంత్రి వ్యక్తిగత సిబ్బంది సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మినిస్టర్‌కు సన్నిహితంగా ఉన్నవారితో కూడా మంత్రి పేరుతో రిక్వెస్టులు పంపి అసభ్యంగా చాటింగ్ చేస్తుండటంతో రుతురాజ్ జాడను పోలీసులు కనిపెట్టగలిగారు. రుతురాజ్ మీద ఐపీసీ 500 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణలో నేరం రుజువైతే ఈ సెక్షన్ ప్రకారం నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది.