: ‘సోనీ’ నుంచి మరో కొత్త ఫోన్ ‘ఎక్స్‌ఏ1 అల్ట్రా’ విడుదల
సోనీ కంపెనీ నుంచి మరో కొత్త మోడల్ మార్కెట్లోకి విడుదల కానుంది. ‘ఎక్స్ పీరియా ఎక్స్ఏ1 అల్ట్రా’ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ మూడు రంగుల్లో లభిస్తోంది. తెలుపు, నలుపు, బంగారు రంగుల్లో లభించే ఈ ఫోన్ ధర రూ.29,990. దీని ప్రత్యేకతల గురించి చెప్పాలంటే..
* 6 అంగుళాల ఫుల్ హెచ్ డీ స్క్రీన్ సైజు
* 64 బిట్ మీడియాటెక్ హీలియో పీ20 ప్రాసెసర్
* 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ
* మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు స్పేస్ పెంచుకునే అవకాశం
* 23ఎంపీ ఈఎక్స్ఎంఓఆర్ కెమెరా, దీనికి 5 ఎక్స్ జూమ్, హెచ్ డీఆర్ మోడ్ సౌలభ్యం
* 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
* 2700 ఎంఏహెచ్ బ్యాటరీ
* ఆండ్రాయిడ్ నోగట్ 7.0 వెర్షన్ ఆధారంగా పని చేసే ఈ ఫోన్ పై పలు ఆఫర్లను సంస్థ ప్రకటించింది. రూ.1490 విలువ గల యూసీహెచ్ 12 చార్జర్ ను ఫోన్ తో పాటు అందిస్తోంది. అంతేకాకుండా, ఉచితంగా మూడు నెలల పాటు సోనీ లైవ్ చూడొచ్చు.