: ఆంధ్రాలో పోటీ చేసినా గెలుస్తా: టీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి
తాను ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని, ఆంధ్రాలో పోటీ చేసినా గెలుస్తానని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో గెలిచే వాళ్లకే సీట్లు ఇవ్వడం జరుగుతుందని, నల్గొండ జిల్లాలోని 12 సీట్లు సహా, తెలంగాణలో 110 స్థానాలు గెలుస్తామని ఆయన జోస్యం చెప్పారు. సీఎ కేసీఆర్ తో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని, తాను ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని, ఆంధ్రాలో పోటీ చేసినా గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి పాలన అందించే నేపథ్యంలో కేంద్రంతో సఖ్యత అవసరమని, ప్రతి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో మెరుగైన సంబంధాలు కొనసాగించాలని అన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే అవసరమని అభిప్రాయపడ్డ జగదీశ్ రెడ్డి, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదని అన్నారు.