: రిలయన్స్ జియో ఫోన్ ఫీచర్స్ ఇవే!
జియో ఫీచర్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు. ఈ ఫోన్ ను ఆయన 'ఇండియాకా స్మార్ట్ ఫోన్' అంటూ సంబోధించారు. ఈ ఫోన్ ఫీచర్లు ఇవే...
- 2.4 ఇంచుల స్క్రీన్.
- ఆల్ఫాన్యూమరిక్ కీ ప్యాడ్.
- టార్చ్ లైట్ కోసం ప్రత్యేక బటన్.
- హెడ్ ఫోన్ జాక్.
- మైక్రోఫోన్, స్పీకర్.
- ఎఫ్ ఎం రేడియో.
- ఎక్స్ పాండబుల్ మెమొరీ కార్డ్ స్లాట్.
- 4-వే నావిగేషన్.
- అన్ని భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది.
- వాయిస్ కమాండ్స్ ద్వారా కూడా ఫోన్ ను ఆపరేట్ చేయవచ్చు.
- ఇంటర్నెట్ ను బ్రౌజ్ చేసే అవకాశం.
- జియో యాప్స్ అన్నీ ప్రీలోడ్ అయి ఉంటాయి.
- జియో సినిమా యాప్ తో సినిమాలు చూసే అవకాశం.