: 30 ఏళ్ల వయసు దాటితే ఇక్కడుండటం కష్టమే!: రకుల్ ప్రీత్ సింగ్


ఇరవై ఏళ్ల తర్వాత సినీ పరిశ్రమలో అడుగుపెట్టే హీరోయిన్లకు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగే అవకాశం చాలా తక్కువని రకుల్ ప్రీత్ సింగ్ అభిప్రాయపడింది. చిన్న వయసులోనే హీరోయిన్ కావడం ఓ గొప్ప అవకాశమని చెప్పింది. 30 ఏళ్లు దాటిన తర్వాత హీరోయిన్ గా కొనసాగడం చాలా కష్టమని తెలిపింది. నయనతార, అనుష్కలాంటి వాళ్లు ఇంకా సక్కెస్ ఫుల్ గా కొనసాగుతున్నారని...అయితే, అలాంటి కెరియర్ చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుందని చెప్పింది. ఇన్నేళ్ల పాటు పరిశ్రమలో కొనసాగాలనే లక్ష్యమేదీ తనకు లేదని... 'రకుల్ బాగా నటిస్తోంది, పర్వాలేదు ఆమెను చూడవచ్చు' అని అభిమానులు అనుకున్నంత వరకు తాను నటిస్తూ ఉంటానని తెలిపింది. ఎన్నేళ్లు ఇండస్ట్రీలో ఉన్నామనే దానికన్నా... ఎన్ని మంచి సినిమాలు చేశామనే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పింది. 

  • Loading...

More Telugu News