: ఇంగ్లండ్ ను ఆషామాషీగా తీసుకోకండి!: తోటి క్రికెటర్లకు కెప్టెన్ మిథాలీరాజ్ హెచ్చరిక


ఆదివారం జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్ లో ఇంగ్లండ్ ను భారత్ ఎదుర్కోబోతోంది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా తన సహచరులకు టీమిండియా కెప్టెన్ మిథాలీరాజ్ పలు హెచ్చరికలు చేసింది. సొంత గడ్డపై ఇంగ్లండ్ ను ఎదుర్కోవడం అంత సులభం కాదని హెచ్చరించింది. ఇదొక ఛాలెంజ్ అని చెప్పింది. మీడియాతో ఆమె మాట్లాడుతూ, టోర్నీ ప్రారంభంలో ఇంగ్లండ్ పై 35 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ... ఆ తర్వాత ఆ జట్టు బాగా పుంజుకుని, ఫైనల్స్ కు చేరుకుందని తెలిపింది. ఫైనల్స్ లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఉండవచ్చని అభిప్రాయపడింది. ప్రత్యేక ప్రణాళికతో బరిలోకి దిగుతామని... మెరుగైన ప్రదర్శన చేస్తామని తెలిపింది. 2005లో తన నాయకత్వంలోనే భారత జట్టు ఫైనల్స్ కు చేరుకుందని... ఇప్పుడు మళ్లీ తన నాయకత్వంలోనే ఫైనల్స్ కు చేరుకోవడం సంతోషంగా ఉందని చెప్పింది. 

  • Loading...

More Telugu News