: నయనతారతో డీల్ కుదుర్చుకున్న టాటా స్కై


డీటీహెచ్ సేవలందిస్తున్న టాటా స్కై సంస్థ, దక్షిణాది రాష్ట్రాల్లో మార్కెట్ వాటాను మరింతగా పెంచుకునేందుకు నిర్ణయించుకుని, బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ నయనతారను నియమించుకుంది. ఈ మేరకు ఆమెతో డీల్ కుదుర్చుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. తమ బ్రాండ్ కు మరింత ప్రచారం నిర్వహించేందుకు నయనతారతో కొత్త కమర్షియల్ యాడ్స్ రూపొందించనున్నట్టు తెలిపింది.

కాగా, ఇప్పటికే అమితాబ్ బచ్చన్ టాటా స్కై ప్రచారకర్తగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. రూ. 229కి 220 చానళ్లను సౌత్ స్పెషల్ ప్యాక్ రూపంలో అందిస్తున్న టాటా స్కై, నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో 6.4 కోట్ల కుటుంబాలను చేరుకోవాలన్న లక్ష్యంతో విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తోంది.

  • Loading...

More Telugu News