: విచారణలో షాకింగ్ నిజాలు ... డ్రగ్ పెడ్లర్ శ్యామ్ కే నాయుడు... గంటల తరబడి పూరీ ఛాటింగ్!


డ్రగ్స్ దందా పేరుతో తన తండ్రిని బద్నాం చేస్తున్నారంటూ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమార్తె ఇన్ స్టా గ్రాం ఖాతా ద్వారా చెప్పిన నీతులు, తనకు సిగిరెట్ అలవాటే లేదు... ఇక డ్రగ్స్ అంటే ఏమిటో కూడా రుచి చూడలేదు, అసలు ఎప్పుడూ చూడనే లేదంటూ మీడియా ముందు శ్యామ్ కే నాయుడు చెప్పిన కథలు అంతా అబద్ధాలని తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ కు డ్రగ్స్ చేరవేసింది శ్యామ్ కే నాయుడేనని సిట్ అధికారులు చెబుతున్నారు.

 పూరీ జగన్నాథ్ ఇంటర్నేషనల్ సిమ్ ద్వారా గంటల తరబడి ఛాట్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. దీనిపై పూరీని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదన్న పూరీ జగన్నాథ్... సిమ్ చూపించి, ఛాట్ వివరాలు చూపించే సరికి తప్పు అంగీకరించినట్టు తెలుస్తోంది. బ్యాంకాక్ నుంచి పూరీ జగన్నాథ్ కెల్విన్ తో గంటల తరబడి చాట్ చేశాడు. ఆ సిమ్ ద్వారా గ్రూప్ కూడా క్రియేట్ చేసినట్టు, దాని ద్వారా డ్రగ్స్ అమ్మకాలు సాగించినట్టు తెలుస్తోంది. దీంతో డ్రగ్స్ దందా మొత్తం బట్టబయలైనట్టు సమాచారం. అయితే విదేశాల నుంచి వచ్చే పార్సిల్స్ ను పూరీకి అందించానే తప్ప, అందులో ఏముందో కూడా తనకు తెలియదని శ్యామ్ కే నాయుడు చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై సుబ్బరాజును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

  • Loading...

More Telugu News