: మరో ఆవిష్కరణ... జియో ఫోన్ టూ టీవీ కేబుల్ విడుదల


స్మార్ట్ ఫోన్ వాడకం దారులకు రిలయన్స్ మరో అద్భుత ఆవిష్కరణను పరిచయం చేసింది. జియో ఫోన్ టీవీ-కేబుల్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు ముఖేష్ అంబానీ ప్రకటించారు. కేవలం స్మార్ట్ టీవీలకు మాత్రమే కాకుండా, అన్ని రకాల టీవీలకూ ఇది పని చేస్తుందని, ఈ కేబుల్ ద్వారా స్మార్ట్ ఫోన్ డేటాతో టీవీ కార్యక్రమాలను, నచ్చిన సమయంలో నచ్చిన సినిమాలను, పాటలను టీవీ స్క్రీన్ పై వీక్షించవచ్చని, లైవ్ కార్యక్రమాలను చూడవచ్చని అన్నారు. నెలకు రూ. 309 చెల్లించడం ద్వారా ఈ ప్యాక్ ను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. జియో ధన్ ధనా ధన్ ఆఫర్ లో ఉన్నవారు రోజుకు మూడు నుంచి నాలుగు గంటల పాటు టీవీలో కార్యక్రమాలను చూడవచ్చని అన్నారు.

  • Loading...

More Telugu News