: ఆగస్టు 15 నుంచి భారతీయులకు డిజిటల్ ఫ్రీడమ్... కొత్త ఫోన్ ప్రత్యేకతలెన్నో!


జియో నుంచి సరికొత్త 4జీ ఫీచర్ ఫోన్ ను ఆవిష్కరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆ ఫోన్ ప్రత్యేకతలను స్వయంగా వివరిస్తూ, రానున్న ఆగస్టు 15 నుంచి భారతీయులకు డిజిటల్ స్వేచ్ఛ దగ్గర కానుందని, ఆనాటి నుంచి ఏ ఒక్కరూ వాయిస్ కాల్స్ చేసుకునేందుకు ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదని, ఉచితంగా ఎన్ని నిమిషాలైనా, గంటలైనా మాట్లాడుకోవచ్చని ప్రకటించారు. అన్ని జియో అప్లికేషన్లు ముందుగానే ఇందులో లోడ్ చేసి వుంటాయని, జియో సినిమా, జియో మూవీ, జియో టీవీ యాప్స్ తో పాటు వాయిస్ కమాండ్, ప్రాంతీయ భాషల్లో సందేశాలు పంపుకునే వీలు కూడా ఉంటుందని అన్నారు.

నచ్చిన సాంగ్ ను వాయిస్ కమాండ్ ద్వారా సెలక్ట్ చేసుకోవచ్చని తెలిపారు. ఫోన్ లో 5వ నంబర్ ఎమర్జెన్సీ బటన్ గా పని చేస్తుందని, ఎమర్జెన్సీ లొకేషన్ ను షేర్ చేయడం ఈ ఫీచర్ ప్రత్యేకతని ముఖేష్ పేర్కొన్నారు. 4జీ ఫీచర్ ఫోన్ లో నెలకు కేవలం రూ. 153కు అన్ లిమిటెడ్ డేటాను అందిస్తామని, వాయిస్ కాల్స్ ఎన్ని చేసుకున్నా ఉచితమేనని, ఎస్ఎంఎస్ లు కూడా ఉచితమని ముఖేష్ తెలిపారు.

  • Loading...

More Telugu News