: సీబీఐ కోర్టుకు హాజరైన జగన్
వైసీపీ అధినేత జగన్ నేడు హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఆయన కోర్టుకు వచ్చారు. ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరు కావాల్సిన నేపథ్యంలో, గగన్ విహార్ లోని కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు మరో నిందితుడు విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు.