: ఎన్నికలు బహిష్కరించాలని ముషారఫ్ పార్టీ నిర్ణయం


తీవ్రవాదం, పేదరికంతో కునారిల్లుతోన్న పాకిస్తాన్ ను ఉద్ధరించాలని ఉందంటూ.. నాలుగేళ్ళ స్వీయ ప్రవాసం వీడి స్వదేశంలో అడుగుపెట్టిన మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు చేదు అనుభవాలు ఎదురైన సంగతి తెలిసిందే. మరోసారి అధ్యక్ష పదవి చేపట్టాలన్న ఆయనకు గట్టి ఎదురుదెబ్బలా జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా పెషావర్ హైకోర్టు ఆదేశించడం, అంతకుముందే ఆయన నామినేషన్లు తిరస్కరణకు గురికావడం, పలు కేసులు వెంటాడడం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇకపై ముషారఫ్ పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆయన పార్టీ ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఏపీఎంఎల్) తాజా ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించింది.

ఈమేరకు ఏపీఎంఎల్ ప్రతినిధి ముహమ్మద్ అంజాద్ ఓ ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ముషారఫ్ నామినేషన్లు తిరస్కరణకు గురైనందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని అంజాద్ చెప్పారు. కాగా, పాక్ సర్కారు మోపిన అన్ని కేసులను ఎదుర్కొంటారని అంజాద్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News