: గ్రీస్ లో భారీ భూకంపం... అతలాకుతలమైన కోస్ నగరం!
గ్రీస్ లో భారీ భూకంపం సంభవించింది. గ్రీస్ ద్వీపంలోని కోస్ ఐలాండ్ కు చేరువగా భూకంప కేంద్రం ఉంది. 6.5 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి గ్రీస్ ద్వీపం వణికిపోయింది. వందలాది భవనాలు నేలకొరిగాయి. కోస్ నగరం పూర్తిగా అతలాకుతలమైపోయింది. ఇతర ప్రాంతాల్లో కూడా భూకంప తీవ్రత కనిపిస్తున్నప్పటికీ.... కోస్ కు తగిలిన దెబ్బ చాలా తీవ్రమైనది.
ఆర్థిక మాంధ్యంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న గ్రీస్ కు ఈ భూకంపం మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపం ధాటికి ఇద్దరు మృత్యువాతపడగా, 100 మందికి పైగా గాయపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన గ్రీస్ పోలీసులు, విపత్తు నిర్వహణ సంస్ధ సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.