: ఓటును సరిగ్గా వేయలేకపోయిన ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు తెలిశాయి... మూడో వ్యక్తి ఎవరంటూ ఎడతెగని చర్చ!
నిన్న రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఓట్ల ఎన్నికల లెక్కింపు జరుగుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ లోని ఎమ్మెల్యేలంతా కోవింద్ కే ఓటు వేయగా, మూడు ఓట్లు చెల్లలేదన్న సంగతి తెలిసిందే. మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు తమ ఓట్లను అమరావతి అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులో వేశారు. వీరిలో టీడీపీ ఎమ్మెల్యేలు కదిరి బాబూరావు, జితేంద్ర గౌడ్ లు బ్యాలెట్ పత్రాలపై తాము పొరపాటున సంతకాలు పెట్టినట్టుగా ఆరోజే అంగీకరించారు. వీరి రెండు ఓట్లూ చెల్లబోవని వారం క్రితమే అందరికీ తెలుసు. తాజాగా మరో ఓటు కూడా చెల్లలేదు. దీంతో ఆ మూడో ఎమ్మెల్యే తెలుగుదేశం వ్యక్యా? లేక వైకాపా ఎమ్మెల్యేనా? అన్న విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది.