: నేడు సుబ్బరాజు, రేపు తరుణ్, 24న నవదీప్, 25న చిన్న, తరువాత ఛార్మీ... విచారణ!
డ్రగ్స్ వినియోగంపై మూడో రోజు విచారణ ఎదుర్కోనున్న సినీ ప్రముఖుడు సుబ్బరాజు నేటి ఉదయం 10 గంటలకు తన లాయర్ తో కలిసి సిట్ కార్యాలయానికి చేరుకోనున్నాడు. సుబ్బరాజును ప్రశ్నించేందుకు సిట్ అధికారులు ప్రశ్నావళిని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సుబ్బరాజు విచారణ అనంతరం, బాలనటుడిగా టాలీవుడ్ లో స్టార్ హోదా సంపాదించి, యువనటుడిగా ఆకట్టుకుని ఫేడవుట్ అయిపోయిన తరుణ్ ను రేపు సిట్ అధికారులు విచారించనున్నారు.
అలాగే, ఈ నెల 24న నవదీప్ ను సిట్ అధికారులు విచారించనున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. ఈ నెల 25న చిన్నాను విచారించనున్నారు. తరువాతి రోజు 26న ప్రముఖ నటి ఛార్మిని విచారించనున్నారు. ఛార్మిని ప్రత్యేకంగా విచారించనున్నట్టు తెలిపిన అధికారులు తరువాత మనసు మార్చుకున్నారు. సిట్ కార్యాలయంలోనే ఆమెను కూడా విచారించాలని నిర్ణయించారు.