: చంద్రబాబు కాన్వాయ్ ని ఆపేసిన మందు బాబు!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్రమైన అనుభవం ఎదురైంది. హైదరాబాదు నుంచి అమరావతి వెళ్లేందుకు చంద్రబాబు నాయుడు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్నారు. కాన్వాయ్ తో కలిసి వెళ్తున్న సమయంలో ఆర్జీఐఏ ఠాణా పరిసరాల్లోకి వచ్చేసరికి... అకస్మాత్తుగా కాన్వాయ్ ముందుకు జాతీయ రహదారిపైకి ఒక వ్యక్తి దూసుకొచ్చాడు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

ఇంతలో అక్కడి వారు యాక్సిడెంట్ అవుతుందేమోనని అరవడంతో అప్రమత్తమైన కాన్వాయ్ డ్రైవర్లు ఎలాంటి ప్రమాదం కాకుండా వాహనాలు స్లో చేసి, జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్లారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బాబు కాన్వాయ్ వెళ్లిపోగానే పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా, మద్యం మత్తులోనే అతను కాన్వాయ్ కి అడ్డంగా వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో అతనిని విడిచిపెట్టారు. 

  • Loading...

More Telugu News