: ఆ మాటలు చాలా సిల్లీగా ఉన్నాయి: డ్రగ్స్ అలవాటుపై హీరో గోపీచంద్


సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒత్తిడిని అధిగమించే నిమిత్తం డ్రగ్స్ కు అలవాటుపడ్డారని చెప్పడం ‘చాలా సిల్లీగా’ ఉందని ప్రముఖ హీరో గోపీచంద్ అన్నాడు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఒత్తిడిని అధిగమించేందుకు ఎక్సర్ సైజు చేయడమో, కాసేపు నడవడమో, లేకపోతే, ఓ పుస్తకం చదవడమో, అదీ కాకపోతే ఓ సినిమాకు వెళ్లడమో .. ఇలా చాలా మార్గాలను అవలంబించవచ్చని అన్నాడు.

అంతేకానీ, డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం కరెక్టు కాదని అన్నాడు. ఆధారాలు లేకుండా సినీ ఇండస్ట్రీ వాళ్లే డ్రగ్స్ కు అలవాటుపడ్డారని అనడం సబబు కాదని అన్నారు. అనవసరమైన ఆరోపణల ద్వారా వారి కుటుంబాలు దెబ్బతింటాయిని గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. డ్రగ్స్ జోలికి వెళ్లవద్దని, వాటి వల్ల ప్రయోజనాలు ఉండవని ఈ సందర్భంగా యువతకు గోపీచంద్ సూచించాడు.

  • Loading...

More Telugu News