: విమానంలో భోజనం సరఫరా చేసే ట్రాలీలో అనుమానాస్పద ప్యాకెట్ లభ్యం
ఢిల్లీకి చేరుకున్న ఎయిరిండియా విమానంలో ఈ రోజు సాయంత్రం కలకలం చెలరేగింది. ఆ విమానంలో భోజనం సరఫరా చేసే ట్రాలీలో అనుమానాస్పద ప్యాకెట్ లభ్యం కావడంతో ఈ విషయాన్ని సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్యాకెట్‌లో డ్రగ్స్ ఉన్నాయా? అనే అనుమానం తలెత్తుతోంది. ఆ ట్రాలీలో ఎవరయినా ప్రయాణికులే ఆ ప్యాకెట్‌ను వేశారా? లేక విమానాశ్రయ సిబ్బందే ఆ ప్యాకెట్‌ను ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చారా? అన్న కోణంలో విచారిస్తున్నారు.