: షారుఖ్ ఖాన్ కు షాక్... ఈడీ నోటీసులు
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కు ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఐపీఎల్ నేపథ్యంలో ఆయన పాల్పడ్డ ఫెమా నిబంధనల ఉల్లంఘన చర్య కింద షారుఖ్‌తో పాటు ఆయన భార్యకు, మరోపక్క ప్రముఖ నటి జూహ్లి చావ్లాకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నైట్ రైడర్స్ స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఆర్ఎస్పీఎల్)లో తన షేర్లను ఓ సంస్థకు వాస్తవ ధర కంటే తక్కువ ధరకే విక్రయించినందుకుగానూ షారుఖ్ ఖాన్ ఈ కేసును ఎదుర్కుంటున్నాడు. ఈ ఏడాది మార్చిలో షారుఖ్ ఖాన్‌కి ఈ కేసులో ఈడీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.