: ఆ వదంతులని నమ్మకండి!: చెన్నై బ్యూటీ సమంత
సినీ నటి సమంత ఈ ఏడాది అక్టోబర్లో తన ప్రేమికుడు నాగచైతన్యని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఆమె పెళ్లి నేపథ్యంలో ఎన్నో వదంతులు వ్యాపిస్తున్నాయి. సమంతతో చైతూ పెళ్లి అతిరథ మహారథుల మధ్య అంగరంగ వైభవంగా, అందరూ గొప్పగా చెప్పుకునేలా జరగబోతోందని, పెళ్లైన మూడు నెలల వరకు షూటింగుల్లో పాల్గొనబోదని రూమర్లు వస్తున్నాయి. వీటన్నింటిపై స్పందించిన చెన్నై బ్యూటీ.. అక్టోబరు ఆరున తమ పెళ్లి వేడుక గోవాలో జరుగుతుందనన్నది నిజమేనని, అయితే అంగరంగ వైభవంగా మాత్రం జరగడం లేదని చెప్పింది.
ఓ సాధారణ కుటుంబంలో జరిగే పెళ్లిలా తమ పెళ్లి జరుగుతుందని, వివాహానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు వస్తారని సమంత తెలిపింది. అలాగే తాము హనీమూన్ వెళ్లబోమని, పెళ్లైన మూడో రోజునే షూటింగ్లో పాల్గొంటామని స్పష్టం చేసింది.