: అందులో ఏం చూస్తున్నావోయ్!: యువరాజ్ కు హర్భజన్ సింగ్ సరదా ప్రశ్న
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ తన పక్కన కూర్చొని రెండు కళ్ల గుడ్లనూ పక్కకు తిప్పుతూ ఎవ్వరికీ తెలియకుండా చూస్తున్నప్పుడు తీసిన ఓ ఫొటోను హర్భజన్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్‌పై హర్భజన్ సెటైర్ వేశాడు. ఓయ్.. యువీ నా ఫోన్‌లో ఏం చూస్తున్నావ్? అంటూ హర్భజన్ ప్రశ్నించాడు. ఈ ఫొటోలో యువీ, భజ్జీ యంగ్ గా కనపడుతున్నారు. హర్భజన్ తన ఫోన్‌లో ఏదో చెక్ చేస్తుంటే యువీ అందులోకి చూస్తున్నాడు. ఈ ఫొటో టీమిండియా అభిమానులను ఆకట్టుకుంటోంది.