: రామ్ నాథ్ కు శుభాకాంక్షలు తెలిపిన మీరాకుమార్


భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్ నాథ్ కోవింద్ కు మీరాకుమార్ శుభాకాంక్షలు తెలిపారు. రామ్ నాథ్ పై యూపీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మీరాకుమార్ మాట్లాడుతూ, అత్యంత సవాళ్లతో కూడిన సమయంలో రాజ్యాంగ స్ఫూర్తిని అక్షరాలా నిలబెట్టాల్సిన బాధ్యత ఆయనపై ఉందని అన్నారు. తనకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష పార్టీలన్నిటికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తన కృతఙ్ఞతలు తెలిపారు. సిద్ధాంతాల కోసం తాను చేస్తున్న పోరాటం కొనసాగుతుందని, సాంఘిక న్యాయం, లౌకికవాదం, భావ వ్యక్తీకరణ మొదలైన విలువల కోసం తాను పోరాడతానని చెప్పారు.

  • Loading...

More Telugu News