: నాకు చేతులు దానం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా: గ్రహీత జియాన్ హార్వే
తమ కుమారుని చేతులు దానం చేసి తనకు పునర్జన్మ నిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి కుమారుని చేతులతో లేఖ రాయాలనుందని ప్రపంచంలో అతి చిన్న హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్ జియాన్ హార్వే తెలిపాడు. రెండేళ్ల వయసులోనే ఇన్ఫెక్షన్ సోకి రెండు చేతులు కోల్పోయిన జియాన్‌కి చనిపోయిన మరో పిల్లాడి చేతులను శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. 2015లో జరిగిన ఈ శస్త్రచికిత్స ద్వారా ప్రస్తుతం జియాన్ బేస్‌బాల్ కూడా ఆడగలుగుతున్నాడు. ఈ సందర్భంగా తనకు చేతులు దానం చేసిన దాత తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేయాలనుందని జియాన్ ఆరాటపడుతున్నాడు. త్వరలోనే జియాన్ కోరిక తీర్చడానికి అమెరికాలో తనకు శస్త్రచికిత్స చేసిన ఫిలడెల్ఫియా చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు ప్రయత్నిస్తున్నారు.