: ఆస్తులు ఎక్కువైతే ఇలాంటి దురలవాట్లే వస్తాయి!: డ్రగ్స్ వ్యవహారంపై చంద్రబాబు స్పందన
హైద్రాబాద్‌లో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్ దందా వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆస్తులు ఎక్కువగా సంపాదిస్తే దురలవాట్లే వస్తాయని, అది రుజువు చేయడానికి హైద్రాబాద్‌లో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ వ్యవహారమే ప్రత్యక్ష నిదర్శనమని ఆయన అన్నారు. కుప్పం నియోజకవర్గంలో తన పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
`ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితి రాదు, త్వరలోనే బెల్ట్ షాపులన్నీ మూసేస్తాం` అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని గుడిపల్లి ప్రాంతంలో సుజలనీటి ప్లాంటును, ప్రభుత్వ జూనియర్ కళాశాలను చంద్రబాబు ప్రారంభించారు. అలాగే ఎన్టీఆర్ మోడల్ హౌసింగ్ కాలనీకి ఆయన శంకుస్థాపన చేశారు. త్వరలో హంద్రీ - నీవా కాలువ నుంచి 139 కి.మీ.ల మేర కుప్పం వరకు రూ. 450 కోట్లతో కాలువ నిర్మాణం చేపడతామని ఆయన పేర్కొన్నారు.