: 20 ఏళ్ల క్రితం రామ్‌నాథ్ కోవింద్‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన మోదీ
భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. 20 ఏళ్ల క్రితం ఆయనతో తాను దిగిన ఓ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే కోవింద్‌తో తాజాగా దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేసి గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. రామ్‌నాథ్ కోవింద్‌కు దేశంలోని ప్రముఖుల నుంచి అభినందల వర్షం కురుస్తోంది. యూపీఏ తరఫున రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలబడి పరాజయం పాలైన మీరాకుమార్ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ ఎన్నికలో తనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.