: రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రముఖుల నుంచి అభినందనల వెల్లువ
భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రముఖుల నుంచి అభినందల వర్షం కురుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామ్‌నాథ్ కోవింద్ విజయం పట్ల స్పందిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కోవింద్ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ... రామ్‌నాథ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామిక విలువలతో నడుచుకునే రామ్‌నాథ్ కోవింద్ ఆ పదవికే వన్నెతెస్తారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు తమ సోషల్ మీడియా ఖాతాలో రామ్‌నాథ్ కోవింద్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.