: అజయ్ దేవగణ్ `తానాజీ` ఫస్ట్‌లుక్ విడుదల
మరాఠా వీరుడు సుబేదార్ తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న `తానాజీ` చిత్రం ఫస్ట్‌లుక్‌ను అజయ్ దేవగణ్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. యుద్ధంలో బాణాలను ఎదుర్కుంటూ వీరోచితంగా తానాజీ పోరాడుతున్న ఫొటోను అజయ్ షేర్ చేశారు. `ఆయన (తానాజీ) తన ప్రజలు, తన నేల, తన రాజు శివాజీ కోసం పోరాడారు. వైభవమైన భారతదేశ చరిత్ర గుర్తించని యుద్ధవీరుడు, తానాజీ మలుసరే` అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 2019లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ప్రస్తుతం అజయ్ నటించిన `బాద్‌షాహో` సినిమా సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది.