: శ్యాం కె నాయుడుని ఐదున్నర గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు!


డ్రగ్స్ వ్యవహారంలో సినీమాటోగ్రాఫర్ శ్యాం కె నాయుడితో  సిట్ అధికారుల విచారణ ముగిసింది. నాంపల్లిలోని ఆబ్కారీ కార్యాలయంలో సుమారు ఐదున్నర గంటల పాటు ఆయన్ని విచారించారు. డ్రగ్స్ తీసుకునే అలవాటు తనకు లేదని  శ్యాం కె నాయుడు  చెప్పినట్టు సమాచారం. డ్రగ్స్ సరఫరా దారుడు కెల్విన్ ని ఎన్నిసార్లు కలిశారని, అతనితో ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీశారు. సినిమాల్లో షూట్ లొకేషన్ల కోసం చాలా పబ్స్ కు వెళ్లానని, పలువురు ఈవెంట్ ఆర్గనైజర్లతో పరిచయాలు ఉన్నాయని శ్యామ్ చెప్పినట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News