: ఏపీలో ఒక్కఓటు కూడా దక్కించుకోలేని మీరా కుమార్ !
రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ తరఫున పోటీలో నిలబడిన అభ్యర్థి మీరా కుమార్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ఓటు కూడా పడలేదు. రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు అభ్యర్థికి కావాల్సిన మొత్తం ఓట్లు 5.49 లక్షలు కాగా ఇప్పటివరకు పూర్తయిన కౌంటిగ్ ప్రకారం ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ కు మొత్తం 4,79,585 ఓట్లు పడగా, మీరాకుమార్‌కు 2,04,594 ఓట్లు పడ్డాయి. మొత్తం నాలుగు టేబుళ్లపై 8 రౌండ్ల పాటు కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మీరా కుమార్ మాట్లాడుతూ... ఫలితాలఫై నిరాశలేదని అన్నారు. సైద్ధాంతికంగానే పోటీచేశామని తెలిపారు.