: డ్రగ్స్ కేసుల వల్ల ఇండస్ట్రీకి వచ్చే నష్టమేమీ లేదన్న ప్రముఖ నిర్మాత


డ్రగ్స్ వ్యవహారంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు సిట్ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ ఈ అంశంపై స్పందించారు. డగ్స్ కేసుల వల్ల సినీ పరిశ్రమకు వచ్చిన ప్రమాదమేమీ లేదని ఆయన అన్నారు. తప్పు ఎవరు చేసినా, వారికి శిక్ష తప్పదని తెలిపారు. డ్రగ్స్ కేసులతో సినీ ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఇబ్బంది పెడుతోందనే వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలే అని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని... ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని అన్నారు.

  • Loading...

More Telugu News