: కిడ్నీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాలీవుడ్ కేరెక్టర్ నటుడు..సాయం కోసం వినతి!


బాలీవుడ్ నటుడు సీతారాం పంచల్ మూడేళ్లుగా కిడ్నీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గత పది నెలలుగా లేచి తిరగలేని పరిస్థితిలో ఉన్నాడు. అంతేకాకుండా, సీతారాం పంచల్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో తనకు సాయం చేయాలని సీతారాం తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా అభ్యర్థించాడు. కాగా, ఈ విషయమై సినీ, టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్పందించింది. ఎవరికి తోచిన సాయం వారు చేయాలని కోరుతూ.. సీతారాం పంచల్  బ్యాంకు అకౌంట్ నెంబరు వివరాలను పేర్కొంది. ఇదిలా ఉండగా, ‘స్లమ్ డాగ్ మిలియనీర్’, ‘బ్యాండిట్ క్వీన్’, ‘పీప్లీ లైవ్’, ‘పాన్ సింగ్ తోమర్’ తదితర చిత్రాల్లో సీతారాం పంచల్ నటించాడు.

  • Loading...

More Telugu News