: నల్గొండలో ఫైనాన్షియర్ దారుణ హత్య!


నల్గొండ పట్టణానికి చెందిన ప్రముఖ ఫైనాన్షియర్ మట్టా సైదయ్య దారుణ హత్యకు గురయ్యారు. భూ వివాదం సమస్యపై మాట్లాడే నిమిత్తం స్థానిక క్లాక్ టవర్ సమీపంలోని హోటల్ స్టేఇన్ లో సైదయ్య సమావేశమయ్యారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన గొంతు కోసి హత్య చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News