: రాజమండ్రి వద్ద ఉగ్రరూపం దాల్చిన అఖండ గోదావరి


ఎగువ నుంచి వస్తున్న వరద, భారీ వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. రాజమండ్రి వద్ద అఖండ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఈ మధ్యాహ్నం సమయానికి నీటిమట్టం 8.2 అడుగులకు చేరుకుంది. భద్రాచలం నుంచి భారీగా వరద నీరు వస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీకి సుమారుగా 3.34 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, మొత్తం 170 గేట్లను ఎత్తివేశారు. ఆనకట్ట నుంచి 3,36,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాయంత్రానికి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.   

  • Loading...

More Telugu News